హిందూపురం మండలంలోని బిట్ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ అరుణ్‌బాబు, జేసీ అభిషేక్ పరిశీలించారు. ఎన్నికల తరువాత కౌంటింగ్‌కు ఇక్కడ అనుకూల పరిస్థితులపై ఆరాతీశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. వారి వెంట పెనుకొండ సబ్‌కలెక్టర్ అపూర్వ భరత, తహసీల్దార్ శివప్రసాద్‌రెడ్డి, మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఎన్నికల డీటీ రెడ్డిశేఖర్, ఆర్‌ఐ అమరేంద్ర, సిబ్బంది ఉన్నారు.
Discussion about this post