టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఆయన వల్ల మంచి జరిగిందా?.. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
‘2022లో కుప్పంకు వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకువచ్చాం. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి. కుప్పుం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పిన చేసి చూపించాం.
source : sakshi.com
Discussion about this post