మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నా.. ఓటేసి ఆశీర్వదించండి’.. అని శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఓటర్లను అభ్యర్థించారు. మంగళవారం మండలం లోని బీ పప్పూరు గ్రామంలో టీడీపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి ఆలం నరసానాయుడితో కలిసి నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడారు. ఎన్ని కలహాలు, సమస్యలు ఉన్నా… మనమంతా ఒక కుటుంబ సభ్యులమని, ఐకమత్యంతో ముందుకు వెళ్దామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గంలో టీడీపీని భారీ మెజా ర్టీతో గెలపించి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవనకల్యాణ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post