అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలికలోని పలు వార్డుల్లో ఓటరు తుది జాబితా పరిశీలనలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు తెలుసుకుంటున్నారు. వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనకూడదని ఉన్నతాధికారులు జారీచేసిన ఆదేశాలను వారు బేఖాతరు చేస్తున్నారు. తాడిపత్రి పట్టణంలోని పాతకోట కాలనీలోని 226, 227 బూత్‌లకు సంబంధించి కొంతమంది వాలంటీర్లు ఆదివారం ఇంటింటికి తిరిగి జాబితాపై పరిశీలన చేశారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రవి దృష్టికి తీసుకెళ్లగా.. వారు బీఎల్‌వోలతో కలిసి వెళ్తున్నారా, లేదా అనే దానిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
source : eenadu.net
Discussion about this post