అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్‌లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇది. నెల అయినా కాకముందే పైకప్పు కూలిపోయింది. దీన్ని కట్టించిన గుత్తేదారు ఓ వైకాపా నాయకుడు. ప్రభుత్వమిచ్చే రూ.1.80 లక్షలతో పాటు అదనంగా మరో రూ.1.30 లక్షల మొత్తాన్ని లబ్ధిదారుడు సొంతంగా ఇచ్చారు. స్లాబ్ వేస్తున్న సమయంలోనే సిమెంటు తక్కువ వాడుతుండటాన్ని గమనించి ప్రశ్నించారు. గుత్తేదారు తిరిగి వారినే గద్దించాడు. ఆ కుటుంబం శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా, మంగళవారం ఉదయం ఇంటి పైకప్పు ముందుభాగం కూలిపోయింది.
source :eenadu.net
Discussion about this post