మీకు, మీ కుటుంబాలకు ఎప్పుడు.. ఎలాంటి కష్టం వచ్చినా నీడలా అండగా ఉంటానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పార్టీ కార్యకర్తలకు అభయమిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. గతంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని టీవీలో చూసి గుండెపోటుతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. లోకేశ్ జన్మదినం సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీ మోతుకపల్లికి చెందిన హేమంత్, శోభ దంపతుల కుమారుడికి నారా భువనేశ్వరి చేతుల మీదుగా కుషల్‌కృష్ణగా నామకరణం చేశారు.శ్రీసత్యసాయి జిల్లాలో గత మూడు రోజులుగా ఆమె చేపట్టిన పర్యటన గురువారంతో ముగిసింది.
source : eenadu.net
Discussion about this post