రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం
రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాం. డిసెంబరులో ఖాళీలను గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం. ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు వారాంతపు సెలవు విధానానికి అవసరమైన అదనపు సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని నియామకాల ప్రక్రియ చేపడతాం
పోలీసు ఉద్యోగాల భర్తీకి వేగంగా చర్యలు చేపట్టాం. కొందరు కోర్టులకు వెళ్లడంతో జాప్యం జరుగుతోంది. ఈ కొలువుల భర్తీకి న్యాయస్థానాల్లో ఉన్న చిక్కులు తొలగించేలా చర్యలు చేపట్టి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం’’
ష్ట్రంలో ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ నిరుద్యోగులను నయవంచన చేశారు. ఈ పోస్టుల భర్తీకి కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ పచ్చి అబద్ధాలు చెబుతూ వేలాది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన మూడున్నరేళ్లకు 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగ ప్రకటన జారీ చేసి దాదాపు 15 నెలలు గడుస్తున్నా నియామక ఊసే కరవైంది. ఈ కొలువులకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష(ప్రిలిమ్స్) ఫలితాలు ప్రకటించి ఈ నెల 5వ తేదీ నాటికి ఏడాది పూర్తయింది.
source : eenadu.net
Discussion about this post