ధర్మవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ గారు మొట్టమొదటిసారి ధర్మవరం విచ్చేస్తున్న సందర్భంగా ఆయన సభ ని విజయవంతం చేయాలని సీనియర్ బీజేపీ నాయకులు కోరారు. ఏప్రిల్ 1వ తేదీ బత్తలపల్లి మార్గమున ధర్మవరం కి చేరుకోనున్న సత్య కుమార్ గారికి ధర్మవరం మార్కెట్ యార్డ్ వద్ద నుండి భారీ కాన్వాయ్ తో స్వాగతం పలకాలని ధర్మవరం కదిరి గేట్ పేరు బజార్ అంజుమాన్ సర్కిల్ కూడలిగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని ఎన్టీఆర్ సర్కిల్లో పబ్లిక్ అడ్రెస్సింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు అనంతరం అక్కడి నుండి బత్తలపల్లి మార్గంలో ఉన్న మారుతీ రాఘవేంద్ర స్వామి ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా బిజెపి కార్యకర్తలు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు

Discussion about this post