ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెదేపా శంఖారావం పూరించనుంది. ఐదు రోజులుపాటు 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి పర్యటన షెడ్యూల్ జిల్లాకు అందింది. ముందుగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఈ నెల 7న హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోను శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రికి పుట్టపర్తిలో బస చేస్తారు. 8న పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోను, 9న కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోను, 10న ఉరవకొండ, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లోను, 11న తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలో శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post