వివరాలు:-1) 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురము నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసన సభ సభ్యులు శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురము 1వ డివిజన్ లోని ఎర్రనేలా కొట్టాల నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు, శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారితో పాటు గడప గడప తిరుగుతూ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ-అభివృద్ధి పథకాలను వివరిస్తూ, రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం ఇలానే కొనసాగాలంటే అది కేవలం వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వంతోనే సాధ్యమని, ప్రజలందరూ రానున్న ఎన్నికలలో వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వం అండగా నిలిచి శ్రీ అనంత వెంకట రామి రెడ్డి గారిని ఎమ్మెల్యే గా గెలిపించి, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో అనంతపురము నగర పాలక సంస్థ మేయరు, డిప్యూటి మేయర్లు, కార్పొరేటర్లు, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


Discussion about this post