ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా నాయకులు వివిధ వర్గాల ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి రోజా తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయినులకు ‘మహిళా దినోత్సవ’ కార్యక్రమం పేరుతో చీర, జాకెట్లను అందజేశారు. పైగా ఈ కార్యక్రమానికి రాకుంటే చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులతో సందేశాలు పంపించడంతో గురువారం సాయంత్రం పుత్తూరు షాదీమహల్‌లో నిర్వహించిన సమావేశానికి వారు తప్పక హాజరుకావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి.. వారికి తాయిలాలు అందజేసి, విందు ఇచ్చారు.
కొన్నిరోజులుగా నియోజకవర్గంలోని కుల సంఘాలను, విలేకర్లను, వారి కుటుంబసభ్యులను కూడా తన ఇంటికి ఆహ్వానించి దుస్తులు అందించి, అల్పాహారం పెట్టించారు. ప్రకాశం జిల్లాలోనూ ఒంగోలు వైకాపా పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాలంటీర్లకు పంపిన తాయిలాల(హాట్ బాక్సుల సెట్టు, టీ కప్పులు, ప్లేటు, గ్లాసు, వాటర్‌బాటిల్)ను గురువారం గిద్దలూరులోని వైకాపా సమన్వయకర్త కార్యాలయంలో స్థానిక నాయకులు పంపిణీ చేశారు.
source : eenadu.net
Discussion about this post