గత ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తమను మోసగించారని ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఆదివారం కలికిరిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని కలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేలా తెదేపా ఎన్నికల అజెండాలో పొందుపరచాలని వినతిపత్రం అందజేశారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తమకు నష్టం కలిగేలా జీపీఎస్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిందని వినతిపత్రంలో వివరించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛను, గ్రాట్యుటీ పొందగలిగామని, ఈ ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల తరహాలో సీపీఎస్‌ను రద్దు చేసినట్లు మన రాష్ట్రంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉద్యోగులు పేర్కొన్నారు. సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని కిశోర్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. బెంగుళూరులోని ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆదివారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని కలిసి గెలుపునకు కృషి చేస్తామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సలహాదారులు అక్రమ సంపాదనతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని, వీరి ప్రయత్నాలు తిప్పి కొడతామన్నారు.
source : eenadu.net
Discussion about this post