నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రాబోవు ఎన్నికలే చివరివి కానున్నాయని అనంతపురం పార్లమెంట్, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు ఎం.శంకరనారాయణ, వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా కనుమరుగు కానుందని స్పష్టం చేశారు. సోమవారం కూడేరు మండలం పి.నాగిరెడ్డిపల్లిలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మతో కలసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అత్యంత జనాదరణ కలిగిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదర్కొనే దమ్ము లేక బీజేపీతో పొత్తుకు పాకులాడుతున్నారన్నారు. ప్యాకేజీల కోసం ఆశపడి చంద్రబాబు కాళ్ల వద్ద జనసే పార్టీని తాకట్టు పెట్టిన ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞానిగా మారాడన్నారు. బాబు మాదిరే పొత్తుల పేరుతో తనను నమ్ముకున్న పార్టీ నేతలకు పవన్‌కళ్యాణ్ కూడా వెన్నపోటు పొడుస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓ వలస పక్షి అని, ఎన్నికల వేళ మాత్రమే ప్రజల వద్దకు ఆయన వచ్చి వెళతాడని ఎద్దేవా చేశారు. వెన్నపోటుదారులు, వలస పక్షులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే అన్ని వర్గాల వారికీ లబ్ధి చేకూరిందన్నారు. ఈ నేపథ్యంలో బాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా.. చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2024లో వైఎస్సార్‌సీపీ రెండో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
source : sakshi.com
Discussion about this post