నెల్లూరు శివారు వెంకటేశ్వరపురం వద్ద నిర్మించిన జగనన్న కాలనీలో పంపిణీకి సిద్ధం చేసిన ఇళ్లు ఇవి. ఆప్షన్-3 కింద ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులకు రూ1.80 లక్షల చొప్పున చెల్లించారు. ఈ మొత్తం సరిపోవడం లేదంటూ గుత్తేదారులు ఇంటి లోపలి భాగాన్ని అసంపూర్తిగా వదిలేస్తున్నారు. బయట మాత్రం ఇలా రంగులు వేసి ‘సిద్ధం’ చేసేశాం అని చెబుతున్నారు. ఈ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చుకోవాలంటే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. దీనిపై జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజును వివరణ కోరగా ‘పొదుపు మహిళలకు అదనంగా మరో రూ.35 వేలు రుణం ఇవ్వనున్నాం. లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉన్నాం. గుత్తేదారు ఇళ్లను పూర్తిచేసి అప్పగిస్తారు’ అని తెలిపారు.
source : eenadu.net
Discussion about this post