ప్రతి ఒక్కరు ఇంటింటికీ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్‌కన్వీనర్ మనోహర్‌నాయుడు సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఇంటిగ్రేటెట్ ట్రైనింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌నాయుడు మాట్లాడుతూ… మినీమేనిఫెస్టో పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేసి.. బాండ్ రూపంలో రాసి ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహాశక్తి పథకాలను, యువగళం నిధి ద్వారా నిరుద్యోగభృతి, ఏడాదికి రూ.3వేలు అందించే వివరాలను, అన్నదాత పథకం కింద రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.20వేలు ఇచ్చే విషయాన్ని తెలియజేసి టీడీపీ ని ఆశీర్వదించే విధంగా ప్రతి కుటుంబాన్ని అభ్యర్థించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక చట్టం ద్వారా పార్టీ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా ఓటరు జాబితాపై కూడా ప్రత్యేక దృష్టి సారించి దొంగ ఓట్లు, డబుల్‌ఎంట్రీలను గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, బోయరవి, పరిశే సుధాకర్, భీమనేని ప్రసాద్‌నాయుడు, చింతపులుసు పెద్దన్న, నాగూర్‌హుస్సేన, రాళ్లపల్లిషరీఫ్, మాధవరెడ్డి, అంబటిసనత, బీబీ, మహేశ, తోటనారాయణస్వామి, సుబ్బయ్య, టైలర్‌గోపాల్, శంకర్ పాల్గొన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post