ఆత్మకూరు మండలంలో తెలుగదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బి.యలేరు గ్రామం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కూరాకుల శంకర్ నారాయణ రెడ్డి (చిన్న) తో పాటు 20 కుటుంబాలు తెలుగు దేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరందరూ వైసీపీలో చేరారు. కురాకుల శంకర్ నారాయరెడ్డి (చిన్న) గారికి ఎమ్మెల్యే గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చిన్నతో పాటు 20 కుటుంబాలు వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. చేరిన వారిలో తలారి కర్రి చెండ్రాయుడు, కురుబ విశ్వనాథ్, చాకలి ఈశ్వరయ్య, బదలాపురం పోతన్న, కమ్మరి పరమేశ్వరి, కమ్మరి అనిత, హరిజన వేపకుంట లింగన్న, హరిజన నల్లప్ప, హరిజన నాని, హరిజన కొరివి శంకరయ్య, M.వంశీ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

Discussion about this post