జిల్లా స్థాయిలో జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఒక పద్ధతి అంటూ లేదు. ఇందులో తమ జట్టు కు అన్యాయం జరిగింది… అంటూ యాడికి మండలం కబడ్డీ జట్టు సభ్యులు కలెక్టర్ గౌతమికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సదరు జట్టు సభ్యులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. గ్రామ/వార్డు స్థాయిలో ఆడిన వారే.. మండల, నియోజకవర్గ స్థాయిలో ఆడాలి. ఆ తర్వాత అదే జట్టు సభ్యులే జిల్లా స్థాయికి రావాలి. అలా కాకుండా.. అనంత, కర్నూలు, ధర్మవరం, రాప్తాడు, ఉరవకొండ, పెద్దవడుగూరు, వంటి ప్రాంతాల నుంచి సభ్యులు ఉన్నారు. వీరందరూ కింద స్థాయి పోటీల్లో పాల్గొనలేదు. దీన్ని ప్రశ్నించినా స్పందన లేదని వారు వాపోయారు. క్రీడల నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం కొనసాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ జట్టును రద్దు చేసి… తమకు అవకాశం కల్పించాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post