ధర్మవరం పట్టణంలోని 38వ వార్డు కొత్తపేట నందు ధర్మవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ పరిటాల శ్రీరామ్ సతీమణి, శ్రీమతి జ్ఞానమ్మ గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి మహిళలను అభ్యర్థిస్తు ఈ అవినీతి వైసిపిని తరిమేయాలని, అందుకు రాబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేరు చెప్పి ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తోందని, అందులోనూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వర్గాల అభివృద్ధికి చేసిందేమీ లేదని, అయితే కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడని తెలిపారు. గతంలో ఈ దేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అలాగే ఇప్పుడు కూడా అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయనున్నారని తెలిపారు.*

Discussion about this post