సార్వత్రిక ఎన్నికల ప్రచారం, వాహనాలు, ప్రచార సామగ్రి రవాణాకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని కలెక్టర్ ఎం.గౌతమి స్పష్టం చేశారు. అన్ని శాఖల నుంచి ఎన్‌ఓసీ తీసుకుని సింగిల్ విండో ఎన్కోర్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
పార్లమెంటరీ అధికారం సీఈసీదే..
● పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తులు ఆమోదించే అధికారం ప్రధాన ఎన్నికల అధికారికి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రచారం, ప్రచార సామగ్రి రవాణా వాహనాల అనుమతికి ప్రధాన ఎన్నికల అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, పార్టీల ఆఫీస్ బేరర్ల వాహనాలకు, వీడియో వ్యాన్ కోసం సీఈసీకే దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లా ఎన్నికల అధికారికైతే ఇలా..
● జిల్లాస్థాయి ఆఫీస్ బేరర్ వాహనం
● హెలికాప్టర్, హెలిప్యాడ్, ఎయిర్ బెలూన్ల కోసం
పార్లమెంటు ఆర్‌ఓ వద్ద..
● సమావేశం, ఉరేగింపు, లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు
● తాత్కాలిక పార్టీ కార్యాలయం తెరిచేందుకు
● ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి
● అభ్యర్థి కోసం పూర్తి అసెంబ్లీ ప్రాంతానికి ఒక వాహనం, పార్లమెంట్ పరిధిలో వాహనం, లౌడ్ స్పీకర్ అమర్చిన వాహనం కోసం
● బ్యానర్, జెండాలు ప్రదర్శించేందుకు, ర్యాలీ నిర్వహించేందుకు.
ఏఆర్‌ఓ వద్ద దరఖాస్తు ఇలా..
● అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కోసం పూర్తి అసెంబ్లీ ప్రాంతానికి ఒక వాహనం
● పార్టీ, పార్టీ కార్యకర్త కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక వాహనం
● పోస్టర్లు, హోర్డింగ్, యూనీపోల్ ప్రదర్శించేందుకు ఏఆర్‌ఓ వద్ద అనుమతి పొందాలి.
Discussion about this post