ప్రతిపక్షనేత చంద్రబాబు తనపై పసలేని విమర్శలు చేయడం మానుకోకపోతే రాళ్ల దాడులు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఆదివారం పుంగనూరు పరిధిలో పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంకు నీళ్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలను అధికారంలోకి రాగానే మరిచిపోయే చంద్రబాబు తమను విమర్శించడం తగదన్నారు. ఎన్నికల హామీలను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ అమలుచేయడానికి శ్రీకారం చుట్టడంతో ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.
source : eenadu.net
Discussion about this post